అప్పుడే కోటి అందుకుంటున్నాడు!

ఇండస్ట్రీలో ఎవరి మార్కెట్ ను బట్టి ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ ను అందిస్తూ ఉంటారు. కొత్తగా వచ్చే హీరో, హీరోయిన్స్ ను లక్షల్లో పారితోషికాలు ఉంటాయి. వారి క్రేజ్ కొంచెం పెరిగితే పారితోషికం కూడా పెరుగుతుంది. అయితే రీసెంట్ గా ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న హీరో అల్లు శిరీష్ అప్పుడే కోటి రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల లిస్ట్ లోకి చేరిపోయాడు. శిరీష్ ప్రస్తుతం దర్శకుడు ఆనంద్ తో కలిసి సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో గల కథలో నటించబోతున్నాడు. చక్రి చిగురుపాటి నిర్మిస్తోన్న ఈ సినిమా కోసం అల్లు శిరీష్ కు అందిన మొత్తం కోటి రూపాయలు. నిజానికి శిరీష్ కు మార్కెట్ లో అంత రేంజ్ లేదు. ఇది వాస్తవం.
శ్రీరస్తు శుభమస్తు సినిమా కూడా హిట్ కావడానికి కారణం పరశురామ్ కృషి.. అలానే అల్లు అరవింద్ సూచనలు. ఆ హిట్ తో శిరీష్ కోటి తీసుకునే హీరోగా మారిపోయాడు. శిరీష్ మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి 1971 సినిమాలో నటిస్తున్నాడు. కాబట్టి రెండు బాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతోనే శిరీష్ కోటి ఆఫర్ చేశారని అంటున్నారు.