కత్తి రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో!

మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన తమిళ చిత్రం ‘కత్తి’. దాదాపు 100 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ పేరుతో తెలుగులో రీమేక్ చేసి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇక్కడ కలెక్షన్స్ మాట వంద కోట్ల పైచిలుకే. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ కు కూడా వెళ్తున్నట్లు సమాచారం. మరి అక్కడ ఏ రేంజ్ కలెక్షన్స్
వసూలు చేస్తుందో..?

అయితే తాజా సమాచారం ప్రకారం నటుడు హృతిక్ రోశన్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు టాక్. కాబిల్ తో మంచి హిట్ అందుకున్న హృతిక్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ కథను ఎన్నుకున్నాడని అంటున్నారు. అయితే దర్శకుడిగా మాత్రం మురుగదాస్ నే తీసుకోవాలనేది హృతిక్ ఆలోచన. నిజానికి మొదట ఈ కథను అక్షయ్ కుమార్ రీమేక్ చేయాలనుకున్నాడు కానీ తన బిజీ షెడ్యూల్స్ కారణంగా హృతిక్ దగ్గరకు ఈ సబ్జెక్ట్ వెళ్ళినట్లు తెలుస్తోంది.