HomeTelugu Big Storiesఅల్లుడి కోసం మామ సినిమా!

అల్లుడి కోసం మామ సినిమా!

rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ తన అల్లుడు ధనుష్ కోసం ఓ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని ధనుష్ తన ట్విటర్ వేదికగా ప్రకటించాడు. రజినీకాంత్ ప్రస్తుతం ‘రోబో2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రజినీకాంత్, ధనుష్ నిర్మించే సినిమా చిత్రీకరణలో పాల్గొనున్నాడు. రజినీకాంత్ తో ‘కబాలి’ వంటి స్టయిలిష్ చిత్రాన్ని రూపొందించిన పా.రంజిత్ ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేయనున్నారు. ‘కబాలి’ సినిమాలో రజినీకాంత్ ను చూపించిన విధానం ప్రేక్షకులకు నచ్చడంతో రజిని మరోసారి రంజిత్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సినిమా ‘కబాలి’కి సీక్వెల్ అనే మాటలు కోలీవుడ్ వర్గాల ద్వారా వినిపిస్తోంది. కానీ ధనుష్ మాత్రం ఓ ఫ్రెష్ ఐడియాతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu