
Multistarrer Movie with 3 Khans of Bollywood:
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర’ మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. ప్రేరణ కలిగించే డ్రామాగా వచ్చిన ఈ సినిమా మొదటి రెండు రోజుల్లోనే రూ. 20 కోట్ల వసూళ్లు రాబట్టి, ఆదివారం ఇంకో మంచి కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. కథ, ఆమిర్ నటనకు విమర్శకులు కూడా పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు.
అయితే సినిమా కంటే మిన్నగా ఇప్పుడు ఆమిర్ చేసిన సెన్సేషనల్ కామెంట్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. బాలీవుడ్‌లో అత్యంత ఫేమస్ త్రయం అయిన ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లపై ఆయన స్పందిస్తూ – “మేమంతా చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాం. మమ్మల్ని ఒకే సినిమాలో చూడాలని అభిమానులు ఎంతకాలంగా ఎదురుచూస్తున్నారో తెలుసు. వాళ్ల ఆశను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. నేను ఇటీవల మల్టీస్టారర్ ఐడియా ప్రపోజ్ చేశాను. షారుఖ్, సల్మాన్ కూడా అంగీకరించారు. ఇప్పుడు మేం సరిగ్గా సరిపడే స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నాం,” అన్నారు ఆమిర్.
ఇతర విషయాల్లో మాట్లాడిన ఆమిర్, తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “ఈ సంవత్సరం నుండి స్క్రిప్ట్ పనులు ప్రారంభించబోతున్నా. ఇది సాధారణ విషయం కాదు. ఒకటి రెండు సినిమాల్లో మహాభారతాన్ని చూపించడం అసాధ్యం. అందుకే ఓ సిరీస్ రూపంలో చూపించాలని నిర్ణయించుకున్నా. దీని ద్వారా ఇండియన్ సినిమా మళ్లీ గ్లోబల్ లెవెల్‌లో గుర్తింపు పొందాలి. ఇండియాలోని గొప్ప డైరెక్టర్లు ఇందులో భాగమవుతారు. ఈ ప్రాజెక్ట్‌లో నేను శ్రీకృష్ణ పాత్ర పోషించాలని ఆలోచిస్తున్నాను,” అని తెలిపారు.
ALSO READ: The Raja Saab Climax గురించి అసలు నిజాలు బయటపెట్టిన నిర్మాత!