‘పర్వీన్‌ బాబీ’ వెబ్‌ సిరీస్‌లో అమలాపాల్‌..


1970ల్లో ఇండస్ట్రీకి వచ్చి శ్రమిస్తున్న దర్శకుడు, ఆ సమయంలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న హీరోయిన్‌కి మధ్య ఉన్న అనుబంధాన్ని కథగా మలిచి నా వెబ్‌సిరీస్‌ ప్రయాణం మొదలుపెడుతున్నానని ప్రకటించారుహిందీ దర్శక–నిర్మాత మహేశ్‌ భట్‌. అయితే ఇది నటి పర్వీన్‌ బాబీకి, మహేశ్‌ భట్‌కి మధ్య జరిగిన వాస్తవ కథే అని బాలీవుడ్‌ లో వార్తలు వినిపిస్తున్నాయి‌. పర్వీన్‌ బాబి బయోపిక్‌ తరహాలోనే ఈ వెబ్‌ సిరీస్‌ ఉంటుందని సమాచారం. పర్వీన్‌ బాబీగా అమలాపాల్‌ నటించబోతున్నారన్నది తాజా సమాచారం. పర్వీన్‌ బాబీ పాత్రకు అమలా పాల్‌ కరెక్ట్‌గా సరిపోతారని టీమ్‌ భావించారట.