
Amitabh Bachchan KBC Remuneration:
తెలుగు ప్రేక్షకులకూ మంచి పరిచయమున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి హెడ్లైన్స్‌లోకి వచ్చారు. ఆయన హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ (KBC) 17వ సీజన్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
అదేంటంటే, అమితాబ్ గారు ప్రతి ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు తీసుకుంటున్నారట! అంటే ఒక్క వారం (5 ఎపిసోడ్‌లు) పని చేస్తేనే ఆయన రెమ్యునరేషన్ రూ. 25 కోట్లు అవుతుంది.
ఇంతవరకు ఎక్కువగా ఛార్జ్ చేసిన హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ పేరు ఉండేది. ఆయన ‘బిగ్ బాస్ OTT’ లో ‘వీకెండ్ కా వార్’ ఎపిసోడ్‌కి రూ. 24 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఆ రికార్డునే బ్రేక్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
KBC అంటేనే అమితాబ్ బచ్చన్ గుర్తుకు వస్తారు. 2000లో ప్రారంభమైనప్పటి నుండి సీజన్ 3 తప్ప మిగతా అన్ని సీజన్లను ఆయనే హోస్ట్ చేశారు. షోకు ఆయన వోయిస్, స్టైల్, ప్రశ్నల తీరే ప్రత్యేక ఆకర్షణ.
ఇప్పుడు ఈ కొత్త సీజన్‌కు ఆయన తీసుకుంటున్న భారీ రెమ్యునరేషన్ చూసి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. అయితే ఆయన స్థాయి, KBCకి ఇచ్చిన గౌరవం చూస్తే, ఇది సరైనదే అనిపిస్తోంది.
తాజాగా ఆయన రజినీకాంత్‌తో కలిసి నటించిన ‘వెట్టైయన్’ సినిమాలో కనిపించారు. ఇప్పుడు టీవీకి మళ్లీ వచ్చారు అన్న వార్త తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.
ALSO READ: Bigg Boss Telugu 9 లో ఈ సారి ఇంతమంది కామన్ మ్యాన్ లు ఉన్నారా?













