HomeTelugu Big Storiesసూర్య పాట విని కన్నీళ్లను ఆపుకోలేక‌పోయాను: అమితాబ్‌

సూర్య పాట విని కన్నీళ్లను ఆపుకోలేక‌పోయాను: అమితాబ్‌

Amitabh bachchan heaps prai

కోలీవుడ్‌ హీరో సూర్య హీరోగా నటించిన చిత్రం ‘సూరరై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా). ఈ సినిమా అందరి నుంచి ప్ర‌శంస‌లు అందుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బచ్చ‌న్ కూడా చూశార‌ట‌. అంతేకాదు, ఈ సినిమాలోని అందని ఆకాశం దించవయ్యా మాకోసం ( కయ్యిలే ఆగాశమ్‌.. కొండు వంద ఉన్‌ పాసమ్‌) అనే పాట వింటూ కంట‌త‌డి పెట్టాన‌ని ఆయ‌న చెప్పారు.

ఒక్కోసారి మ‌నం ఊహించిన దానికి మించి కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయ‌ని, అలాంటి సంఘ‌ట‌నే త‌న‌కు ఎదురైంద‌ని బిగ్ బీ త‌న బ్లాగ్‌లో రాశారు. తాను ఈ సినిమాలోని ఆ పాట విన్న‌ప్పుడు త‌న‌ కన్నీళ్లను ఆపుకోవడానికి ఎంత ప్రయత్నించినా త‌న వల్ల కాలేద‌ని పేర్కొన్నారు. ఆ పాట విన్న‌ప్పుడల్లా క‌న్నీళ్లు కంట్రోల్ చేసుకోలేక‌పోతున్నాన‌ని చెప్పారు.

హీరో సూర్య న‌టించిన ఈ పాట‌లో గుండెను పిండేసే భావోద్వేగం ఉంద‌ని తెలిపారు. సహజత్వానికి దగ్గరగా ఈ పాట ఉంద‌ని అన్నారు. అందుకే కన్నీళ్లను ఆపుకోలేక‌పోయాన‌ని చెప్పారు. ఓ తండ్రీకొడుకు మధ్య ఉండే భావోద్వేగాన్ని ఈ పాట ఆవిష్కరిస్తుంద‌ని వివ‌రించారు. త‌నతో ఈ ఎమోషన్‌ చాలాకాలం ఉండిపోతుందని చెప్పారు. ఈ పాట స్వరకర్త జీవీ ప్రకాశ్‌కుమార్‌.. అమితాబ్‌ స్పందనను ఉద్దేశించి, ‘చాలా ధన్యవాదాలు సార్‌. ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి అభినందనలు దక్కినందుకు ఆనందంగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!