HomeTelugu Trending'బచ్చన్‌' మా ఇంటిపేరు కాదు.. అసలు నిజం చెప్పిన అమితాబ్‌

‘బచ్చన్‌’ మా ఇంటిపేరు కాదు.. అసలు నిజం చెప్పిన అమితాబ్‌

10 25బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ 76 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే తన పేరు చివరిలో ఉన్న ‘బచ్చన్‌’ వెనుకున్న కథను ఆయన తాజాగా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు బ్లాగ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. అది తన తండ్రి, లెజెండరీ కవి హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌ కలం పేరు. అమితాబ్ ఇంటి పేరు శ్రీవాస్తవ అయినప్పటికీ హరివంశ్ కలం పేరు బచ్చన్‌ను ఇంటి పేరుగా మార్చుకున్నారు. కుల వ్యవస్థకు తన తండ్రి వ్యతిరేకమని పేర్కొన్నారు.

‘నాన్న ఇంటిపేరు శ్రీవాస్తవ. కానీ ఆయన ఎప్పుడూ కుల వ్యవస్థకు వ్యతిరేకం. ఆయన కలం పేరు ‘బచ్చన్‌’. నేను పుట్టిన తర్వాత ఒకటో తరగతిలో చేర్పించారు. నా టీచర్‌ ఈ అమ్మాయి ఇంటి పేరు ఏంటి? అని అడిగింది. అడ్మిషన్‌ ఫాంలో నమోదు చేయడానికి ఆమె అడిగారు. మా అమ్మానాన్న చర్చించుకుని ‘బచ్చన్‌’ ను మా ఇంటిపేరు చేశారు. అది ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.. కొనసాగుతుంది..’ అని బిగ్‌బీ పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu