సల్మాన్ తో డేటింగ్ ఓకే అంటోన్న బ్యూటీ!

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు ఉన్న ప్రేమ కథలు మరే హీరోకి ఉన్నట్లు లేవు.. చాలా మంది హీరోయిన్స్ తో సల్మాన్ డేటింగ్ చేయడం.. కొంతకాలానికి ఇద్దరికీ బ్రేకప్ జరగడం ఇదే తంతు.. అయితే కనీసం మోడల్ యులియా వంతూర్ తో ఆయన జరిపిన ప్రేమాయణం అయినా పెళ్లి వరకు దారి తీస్తుందని అంతా అనుకున్నారు. అది కూడా అర్ధాంతరంగా ముగిసింది. యాభై ఏళ్ళు దాటుతున్న సల్లూ భాయ్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. హీరోయిన్స్ లో ఆయనకున్న క్రేజే వేరు.

ఇప్పుడు ఆ లిస్ట్ లోకి అమీజాక్సన్ కూడా చేరిందనే వార్తలు బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్నాయి. రోబో2 సినిమాలో నటిస్తున్న ఈ భామ ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో అమ్మడుకి ‘మీరు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ లో ఉన్నారని విన్నాం..

నిజమేనా..?’ అనే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ ను ఇష్టపడని అమ్మాయిలు ఉంటారా..? అని రివర్స్ లో ప్రశ్న వేసింది. ప్రస్తుతం తాను ఎవరితోనూ డేటింగ్ లో లేననీ.. ఒకవేళ సల్మాన్ తో డేటింగ్ చేసే ఛాన్స్ వస్తే అంతకంటే అదృష్టం ఉండదనీ చెబుతోంది.