HomeTelugu Trendingహైవే ఎక్కిన ఆనంద్ దేవరకొండ

హైవే ఎక్కిన ఆనంద్ దేవరకొండ

Anand Devarakonda Highway m

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘హైవే’ ‘ఏ నర్వ్‌ వ్రాకింగ్‌ రైడ్‌ స్టోరి’ అనేది ట్యాగ్‌లైన్‌. రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. మానస రాధాకృష్ణన్ హీరోయిన్. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఐశ్వర్య లక్ష్మి మూవీస్ పతాకంపై వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. సైమన్ కె. కింగ్ సంగీతం అందిస్తున్నారు. మిగతా నటీనటుల గురించి త్వరలో ప్రకటించనున్నారు. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్‌తో హిట్ అందుకున్నాడు. ఆనంద్‌ దేవరకొండ నటించిన తాజా చిత్రం పుష్పక విమానం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని థియేటర్‌లోనే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu