‘అర్జున్ రెడ్డి’పై హాట్ యాంకర్ కామెంట్!

‘అర్జున్ రెడ్డి’ మేనియా ఇంకా యూత్ లో పోలేదు సరికదా రోజురోజుకి పెరిగిపోతుంది. వాస్తవికతకు దగ్గరగా ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. అలానే సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని తిట్టేవాళ్లు ఉన్నారు. సినిమాలో విజయ్ దేవరకొండ వాడిన ఒక బూతు పదాన్ని ఇప్పుడు వాడుక భాషలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు దాని అర్ధం తెలియక ఏదో జోక్ అనుకొని తల్లితండ్రుల ముందే అనేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళను
రెచ్చగొట్టిన అర్జున్ రెడ్డిపై యాంకర్ అనసూయ ఫైర్ అయింది. ‘మీ ఇంట్లో ఆడవాళ్ళతో ఎవరైనాతప్పుగా మాట్లాడినా, లేక చెడుగా ప్రవర్తించినా.. వాళ్ళ తల్లుల్ని తిట్టమని చెబుతున్నావా..?ఇదేం పద్దతి.. నువ్ ఎదగాలి డూడ్’ అంటూ విజయ్ దేవరకొంపై కామెంట్ చేసింది.

ఈ సినిమా తాను ఇంకా చూడలేదని, చూడాలని ఉన్నా.. విజయ్ దేవరకొండ మాటలతో ప్రభావితమైన వారు థియేటర్ లో ఆ మాట ఎక్కడ అరుస్తారో అనే భయంతో సినిమాకు వెళ్ళడం లేదని అనసూయ చెపుకొచ్చింది. అర్జున్ రెడ్డి చిత్రంబృందం టాలెంటెడ్ అయినా.. వాళ్ళ ప్రతిభను సినిమాలో చూపించాలి గానీ ఇలా పబ్లిక్ పై రుద్ధకూడదని హితవు పలికింది. మరి వీటిపై
యంగ్ హీరో ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి!