త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ఆ జోనర్ కాదట!

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా త్రివిక్రమ్ 80ల కాలం నాటి డిటెక్టివ్ నవల రైట్స్ తీసుకున్నాడని ఆ నవల ఆధారంగా
ఎన్టీఆర్ సినిమా ఉంటుందనే వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఇది స్పై థ్రిల్లర్ సినిమా కాదని పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రమని అంటున్నారు.

ఈ మధ్య కాలంలో ఎన్టీఅర్ నుండి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాలేదు. త్రివిక్రమ్ కూడా ఈ తరహా సినిమా చేసిన చాలా రోజులు అయింది. దీంతో ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయల్ లేదా పూజా
హేగ్దేలను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు.