అరేయ్.. అసలు మీరు మగాళ్లేనారా: అనసూయ .. వైరల్‌ వీడియో


ప్రముఖ యాంకర్‌ అనసూయ ఇప్పుడు సోషల్ మీడియాలో బిజీ అయిపోయింది. అక్కడ ఆమెను కొందరు విమర్శించారు. దాంతో యాంకర్ అనసూయకు చిర్రెత్తుకొచ్చింది. అసలు కంట్రోల్ చేసుకులేని కోపం వచ్చేసింది. అంతగా ఆమెను చిరాకు తెప్పించిన విషయం ఏంటో తెలుసా.. దిశా కేస్. అవును.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అమ్మాయి కేస్‌పై అంతా జాలి చూపిస్తున్నారు. నిండు నూరేళ్ల జీవితం నలుగురు కామాంధుల చేతుల్లో పడి బలి కావడంతో అంతా వాళ్లకు ఉరి సరి అంటున్నారు. ఇక ఈ విషయంపై మాట్లాడటానికి అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో ఛాట్ చేసింది.

ఈ సందర్భంగానే కొందరు నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేయడంతో అనసూయకు కోపం నషాలానికి అంటేసింది. ఒక్కొకడ్ని ఫుట్ బాల్ ఆడేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అసలు మీరు మగాళ్లేనా అంటూ ప్రశ్నించింది. ఓ ఆడపిల్ల రాత్రిపూట బయట తిరగడం నేరమా.. అసలు మనం ఉన్నది మనుషుల మధ్యేనా అంటూ విమర్శించింది. ముఖ్యంగా కొందరు ఆకతాయీలు అమ్మాయిపై జరిగిన ఘోరానికి బాధ పడకపోగా మరింత నీచంగా పోస్టులు పెట్టారు. అమ్మాయి కత్తిలా ఉంది.. అందుకే రేప్ చేసారు.. తర్వాత చంపేసారు తప్పేముంది అంటూ ఒకడు పెట్టాడు.. మీరు చేసే ఎక్స్‌పోజింగ్ వల్లే ఇలా రేపులు జరుగుతున్నాయని మరొకరు.. అమ్మాయి కోపరేట్ చేయకపోతే ఎలా రేప్ చేస్తారని ఇంకొకడు పోస్ట్ చేసాడు.

అవి చూసిన వెంటనే అనసూయకు మండిపోయింది. అరేయ్.. అసలు మీరు మగాళ్లేనారా.. మీ అమ్మ కూడా ఆడదే కదా.. ఆ సంగతి మీకు గుర్తు లేదా.. అమ్మాయిలను కనీసం మనుషుల్లా కూడా చూడని మీ బతుకులు ఎందుకురా అంటూ ఫుట్ బాల్ ఆడేసుకుంది అనసూయ. ఈమెకు నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మాయిలు అంటే ఆట వస్తువులు కాదు కదా.. నేరం చేసినవాళ్లనే కాదు ఇలా సపోర్ట్ చేసిన వాళ్లను కూడా తీసుకెళ్లి శిక్షలు వేయాలి అప్పుడే సిగ్గొస్తుంది నా లం.. కొడుకులకు అంటూ రెచ్చిపోయింది అనసూయ. మొత్తానికి ఈమె ఛాటింగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

CLICK HERE!! For the aha Latest Updates