HomeTelugu Trendingరష్మికి నెటిజన్ల ప్రశంసలు.. వైరల్‌

రష్మికి నెటిజన్ల ప్రశంసలు.. వైరల్‌

8 4

కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్ డౌన్ కోనసాగుతున్న తరుణంలో మనుషులు మాత్రమే కాకుండా రోడ్డున ఉండే జంతువులు కూడా ఆకలితో అలమటిస్తున్నాయి. ముఖ్యంగా రోడ్డున ఉండే కుక్కలు ఆహారం దొరకకా తీవ్ర అవస్థలు పడుతున్నాయి. వాటి కోసం తనవంతు సాయం అన్నట్లుగా కొన్ని స్వచ్చంద సంస్థలు సైతం ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాంకర్ రష్మీ కూడా తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ అమ్మడు ఏకంగా రోడ్ల మీదకు కుక్కలకు ఫుడ్ తో వచ్చేసింది.

కుక్కల కోసం ఫుడ్ ను తీసుకు వచ్చిన రష్మి తన వాలింటీర్లతో కలిసి కుక్కలకు డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక రష్మీ మంచి మనసు తెలుసుకున్న నెటిజన్లు ఆమెను ప్రశంస్తూ.. కామెంట్లు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu