ర‌ష్మి ట్వీట్‌లకు ఫ్యాన్స్‌ అయిపోతున్న నెటిజన్లు

యాంకర్‌ ర‌ష్మిలో కేవ‌లం ఒక యాంగిల్ మాత్ర‌మే చూసారు. ఆమెలో ఉన్న గ్లామ‌ర్ కోణాన్ని మాత్ర‌మే ఇన్ని రోజులు చూపించింది ఈ ముద్దుగుమ్మ కూడా. కానీ త‌న‌లో మ‌రో యాంగిల్ కూడా ఉంద‌ని.. దేశం అంటే ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు చూడండంటుంది ఈ భామ‌. జ‌మ్మూలో జ‌రిగిన టెర్ర‌ల్ అటాక్ గురించి అంద‌రికీ తెలుసు.. అది ఎంత దారుణ‌మో మ‌ళ్లీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పుల్వామా ఘ‌ట‌న‌లో 42 మంది వీర సైనికులు అమ‌రులయ్యారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన ద‌గ్గ‌ర్నుంచి స్పందిస్తూనే ఉంది ర‌ష్మి గౌత‌మ్.

త‌న సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన అప్ డేట్స్‌తో పాటు సంతాపం కూడా తెలియ‌జేసింది ఈ ముద్దుగుమ్మ‌. దానికితోడు సాయం చేయండి అంటూ అంద‌రికీ ట్వీట్ చేసింది. అంత‌టితో ఆగ‌కుండా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఎవ‌రైతే దేశానికి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్లంద‌రికీ వార్నింగులు కూడా ఇచ్చింది ర‌ష్మి. మాజీ క్రికెట‌ర్, రాజ‌కీయ నేత సిద్ధూ ఈ విష‌యంలో పాకిస్థాన్ స‌పోర్టుగా మాట్లాడ‌టంతో ఏకంగా పోరా మీ దేశానికి అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది ర‌ష్మి గౌత‌మ్.

ఈ ఒక్క ట్వీట్ ఆమెపై గౌర‌వాన్ని కూడా చాలా పెంచేసింది. దాంతో పాటు ఇంకా చాలా మందికి కూడా ఘాటు ట్వీట్స్ ఇచ్చింది ర‌ష్మి. ఇక ఇప్పుడు కూడా వీర సైనికుల కోసం ఎవ‌రైతే విరాళాలు ఇస్తున్నారో వాళ్లంద‌రికీ థ్యాంక్స్ చెప్ప‌డ‌మే కాకుండా రీ ట్వీట్స్ కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ర‌ష్మి చేస్తున్న ప‌నులు చూసి అంతా నిజంగానే ఇప్పుడు ఆమెకు ఫ్యాన్స్ అయిపోతున్నారు.