HomeTelugu Trendingప్రదీప్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేసిన శ్రీముఖి..వీడియో వైరల్‌

ప్రదీప్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేసిన శ్రీముఖి..వీడియో వైరల్‌

Anchor srimukhi proposed pr

బుల్లితెర యాంకర్‌ ప్రదీప్‌‌కు హాట్‌ యాంకర్‌ శ్రీముఖి అందరి ముందు లవ్ ప్రపోజ్ చేసింది. దీంతో అక్కడే ఉన్న సింగర్ సునీత, ఆలీ, ఎస్వీ కృష్ణా రెడ్డి షాకయ్యారు. తాజాగా విడుదలైన ‘డ్రామా జూనియర్స్ – ద నెక్ట్స్ సూపర్ స్టార్’ ఎపిసోడ్ ప్రోమో వీడియోలో ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం కనిపించింది. యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ‘డ్రామా జూనియర్స్’ ప్రోగ్రాంలో బుల్లితెర యాంకర్‌ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ ముసుగుతో వచ్చిన ఆమె.. ఏకంగా లవ్ ప్రపోజ్ చేసింది. యాంకర్ ప్రదీప్‌కు నేరుగా ఐ లవ్ యూ చెప్పేసింది. దీంతో ప్రదీప్ తెగ సిగ్గు పడిపోయాడు. ఈ సీన్ చూసి సింగర్ సునీత, ఆలీ, ఎస్వీ కృష్ణా రెడ్డి ఆశ్చర్య పోయారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ వైపు బుల్లితెర హవా నడిపిస్తున్న ప్రదీప్ మాచిరాజు గతంలో పలు సినిమాల్లో సపోర్టింగ్ ప్రాతలు చేశాడు. ఇక ఇటీవల హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో ప్రదీప్‌కు టాలీవుడ్‌లో హీరోగా గ్రాండ్ ఎంట్రీ దక్కిందని చెప్పుకోవచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu