ఆ సినిమాకు విలన్ గా మారిన హీరోయిన్!

సినిమాల్లో తమ పాత్రల ఎంపికతో కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు చాలా మంది హీరోయిన్లు. దాని ద్వారా తమ టాలెంట్ ను చూపించాలనుకుంటున్నారు. ఎలాంటి పాత్రలో అయినా.. నటించగలమని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా కూడా అలాంటి ప్రయత్నమే చేస్తోంది. యుగానికొక్కడు సినిమాలో కార్తీ సరసన ఓ హీరోయిన్ గా నటించిన ఈ భామ ఇప్పటివరకు తమిళ చిత్రాల్లోనే ఎక్కువగా నటించింది. ఇప్పుడు మొదటిసారిగా విలన్ వేషంలో నటించడానికి రెడీ అయిపోతుంది. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తోన్న ‘తుప్పరివలన్’ సినిమాలో ఆండ్రియా లేడీ విలన్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అరవై శాతం పూర్తి అయింది. ఆండ్రియాతో పాటు ఫేమస్ డైరెక్టర్ భాగ్యరాజ్ కూడా ఈ సినిమాలో ఓ నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో విశాల్ సరసన శృతిహాసన్ జంటగా నటిస్తోంది.