యాక్షన్ లోకి దిగిన పవన్!

మాస్ హీరోల సినిమాలంటే యాక్షన్ ఎక్కువ శాతం ఉంటుంది. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి హీరోల సినిమా అంటే ఇక చెప్పనక్కర్లేదు. వినూత్నంగా ఉండే ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ ను చూడడానికే ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ థియేటర్ కు వస్తారు. అందుకే ఆయన సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సెస్ ను ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా, అభిమానులు త్రిల్ ఫీల్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు.

తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాలో కూడా ఫైట్ సీన్లను కొత్తగా చిత్రీకరిస్తున్నారు. దీనికోసం హైదరాబాద్ లో వేసిన ఓ భారీ సెట్ లో ప్రస్తుతం పవన్, విలన్ బృందంపై ఓ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణ నెలాఖరున పూర్తవుతుంది. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూయల్ లు హీరోయిన్లుగా కనిపించనున్నారు. అలానే మరో యంగ్ హీరో ఆది పినిశెట్టి మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు.