మహేష్ ‘ఏఎంబీ’లో ‘అంతరిక్షం’ ట్రైలర్‌!

హైదరాబాద్‌లో ‘ఏఎంబీ’ పేరుతో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ మహేష్ బాబు ఓ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రారంభమైన థియేటర్లలో సినిమా ప్రదర్శనతో పాటు సినిమా ఈవెంట్లను కూడా నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌లో తొలి ఈవెంట్‌ నిర్వహించుకోబోతున్న సినిమా ‘అంతరిక్షం’.

‘ఘాజీ’ ఫేం సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న అంతరిక్షం సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఏఎంబీ సినిమాస్‌లో నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 9 ఉదయం 11 గంటలకు చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినిమా ప్రముఖల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మూవీయూనిట్. దర్శకుడు నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, అదితిరావ్‌ హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates