HomeTelugu Trendingమరొసారి సోనూసూద్ దాతృత్వం.. చంద్రబాబు హామీ

మరొసారి సోనూసూద్ దాతృత్వం.. చంద్రబాబు హామీ

Chandrababu phone to sonuso

మరొసారి దాతృత్వం చాటిన సోనూసూద్.. హామీ ఇచ్చిన చంద్రబాబు ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న తండ్రికి చేదోడువాదోడుగా ఉండడం కోసం ఎంతో శ్రమకోర్చి పొలంలో కాడెత్తుకుని అరక దున్నిన ఇద్దరు అమ్మాయిల ఉదంతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తండ్రి ఇద్దరు కూతుళ్లు నాగలిని లాగుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటుడు సోనూసూద్ స్పందించారు. ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందజేస్తున్నానని ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేశాడు. సాయంత్రానికల్లా ట్రాక్టర్‌ను నాగేశ్వరరావు ఇంటి ముందు ఉంచారు. దీంతో సోనూ సూద్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మధ్య సోనూ సూద్ చేస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఆయన రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం సోనూసూద్ పేరు మారుమోగుతోంది.

దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించాడు. సోనూ సూద్‌కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సోనూ సూద్‌తో తాను ఫోన్ ద్వారా మాట్లాడినట్టు చంద్రబాబు వెల్లడించారు. ఆ రైతు ఇద్దరి కూతుళ్ల చదువు బాధ్యత తాను తీసుకుంటున్నానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ట్వీట్‌కు సోనూ సూద్ స్పందించారు. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘నన్ను ప్రోత్సహిస్తూ మీరు చెప్పిన మాటలకు ధన్యవాదాలు సార్. మీ దయా గుణం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపి ఎదుటివారికి సాయపడేలా చేస్తుంది. మీ మార్గదర్శకంలో లక్షల మంది తమ కలలను సాకారం చేసుకోవడానికి దారులు వెతుక్కుంటారు. మీరు ఇలానే స్ఫూర్తిని నింపుతూ ఉండండి సార్. మిమ్మల్ని త్వరలోనే కలుసుకుంటాను’’ అని సోనూ సూద్ ట్వీట్ చేశారు. కాగా, రైతు నాగేశ్వరరావుకు సోనూ సూద్ చేసిన సాయాన్ని ప్రశంసిస్తూ దర్శకులు క్రిష్ జాగర్లమూడి, మెహర్ రమేష్ ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు సోనూ సూద్ స్పందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!