ప్రభాస్‌, శ్రద్ధా జోడీకి నెటిజన్లు ఫిదా .. ఫొటో వైరల్‌

‘సాహో’ సినిమా సెట్‌లో ఫొటో లీక్‌ అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా కనిపించారు. పాట షూట్‌లో ఈ ఫొటోను క్లిక్‌ మనిపించినట్లు తెలుస్తోంది. ప్రభాస్‌, శ్రద్ధ ఒకర్నొకరు ప్రేమగా చూసుకుంటూ కనిపించారు. వీరి జోడీకి నెటిజన్లు ఫిదా అయ్యారు. చూడచక్కగా ఉన్నారంటూ తెగ కామెంట్లు చేశారు. సినిమా అప్‌డేట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని డార్లింగ్‌ అభిమానులు పేర్కొన్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. స్టిల్‌ను ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు.
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా ఇది. సుజీత్‌ దర్శకుడు. ఇందులో అరుణ్‌ విజయ్‌, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates