పవన్‌ కళ్యాణ్‌ని మరచిన అనుపమ.. ఫ్యాన్స్‌కి క్షమపణలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాని ఏప్రిల్ 30 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రకాష్‌ రాజ్‌, అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. ఇదిలావుంటే, ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్పందించింది. ఇక సినిమా గురించి ఆమె ట్విట్టర్ లో… అమెజాన్ ప్రైమ్ లో గత రాత్రి వకీల్ సాబ్ ను చూశాను. పవర్ ఫుల్ నటన మరియు మంచి మెసేజ్. పవన్ కళ్యాణ్ గారు మంచి సందేశంను ఇచ్చారు. ముగ్గురు అమ్మాయిల కోసం నిలబడ్డ ఆయన నటన బాగుంది. అంజలి.. నివేథ.. అనన్యల నటన బాగుంది. ప్రకాష్ రాజ్ గారు మీరు లేకుండా ఈ సినిమా అసంపూర్ణం అంటూ ట్వీట్ చేసింది. అయితే అనుపమ పవన్ కళ్యాణ్ పై ప్రత్యేకించి చెప్పకపోవడంతో పవన్ అభిమానులు కామెంట్స్ చేశారు. దీంతో అనుపమ.. ‘క్షమించండి.. నేను ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారిని గ్రహించాను. ఆయనంటే ఎంతో గౌరవం, ప్రేమ’ అంటూ మరో ట్వీట్ ద్వారా తెలిపింది.

CLICK HERE!! For the aha Latest Updates