
టాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణంపై నటి అనుష్క శెట్టి దిగ్భ్రాంతికి వ్యక్తం చేసింది. ఆమె ఏఐజీ హాస్పిటల్ కు చేరుకుని కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించింది. ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబంతో అనుష్కకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. వారి కుటుంబ సభ్యురాలిగా మెలిగేది. ఆమె ప్రభాస్ కు మంచి ఫ్రెండ్ అని కృష్ణంరాజు కూడా ఓ సందర్భంలో చెప్పారు. అంత సన్నిహిత కుటుంబం నుంచి ఒకరు కాలం చేయడంతో అనుష్క కలత చెందింది. ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది.
కృష్ణంరాజు అనుష్కను ఎంతో ఆప్యయంగా దగ్గరకు తీసుకోవడం ఆ ఫొటోలో కనిపిస్తోంది. ‘మాకు ఎంతో ఆత్మీయులైన కృష్ణంరాజు గారు మీ ఆత్మకు శాంతి చేకూరాలి.. విశాల హృదయం కలిగిన ఓ దిగ్గజం మీరు .. మా హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు’ అంటూ నమస్కార ఎమోజీలను అనుష్క ట్వీట్ మాదిరి పెట్టింది.
Rest in peace our very own Krishnam raju garu … a legend a soul with the biggest heart ..U will live on in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/hjUs7kyk4d
— Anushka Shetty (@MsAnushkaShetty) September 11, 2022













