‘ఆర్ఆర్ఆర్’లో కీర్తీ సురేష్‌

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఎలాంటి న్యూస్ అయినా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు రాజమౌళిని దర్శకత్వం వహిస్తున్నారు. జూనియర్‌ ఎన్‌టీఆర్, రామ్‌చరణ్‌లతో భారీ మల్టీస్టారర్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఇందులో ఈ ఇద్దరి పేరు మినహా ఇతర ఏ విషయాల గురించి రాజమౌళి పెదవి విప్పలేదు. అయితే ఇప్పుడు ఈ క్రేజీ మూవీ గురించి రోజుకో కథనం ప్రసారం అవుతుందంటే అతి శయోక్తి కాదు. చిత్రానికి రామ రావణ రాజ్యం అని పేరు నిర్ణయించినట్లు, ఇది పురాణ ఇతిహాసం రామాయణం ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కిస్తునట్లు కథనాలు హోరెత్తుతున్నాయి.

అంతే కాదు ఇందులో రామ్‌చరణ్‌ రాముడిగానూ, జూనియర్‌ ఎన్‌టీఆర్‌ రావణుడిగానూ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో నటి ప్రియమణిని ఒక ముఖ్య పాత్రకు ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇక ఇందులో నటి కీర్తీసురేష్‌ కూడా నటించనున్నాట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ప్రచారంలో నిజం ఎంత అన్నది దర్శకుడు రాజమౌళి గానీ, చిత్ర నిర్మాతల వర్గాలు గానీ అధికారికపూర్వకంగా వెల్లడించేవరకూ ఇలాంటి కథనాలకు అడ్డకట్ట పడదు.

CLICK HERE!! For the aha Latest Updates