HomeTelugu Trendingప్రభాస్ 'ఆదిపురుష్' అప్‌డేట్

ప్రభాస్ ‘ఆదిపురుష్’ అప్‌డేట్

Prabhas Adipurush update

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ప్రభాస్ తదుపరి చిత్రం బాలీవుడ్ లో తెరకెక్కబోతోంది. ‘ఆదిపురుష్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపిస్తుండగా, లంకేశ్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నారు. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేయనున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ సినిమా హిందీ, తెలుగు సహా ఐదు భాషల్లో తెరకెక్కబోతోంది. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్.. మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్లుగా పలువురి పేర్లు వినిపిస్తున్నా తాజాగా అనుష్క శర్మ పేరు తెరపైకి వచ్చింది. ఇందులో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. మరోవైపు ఈ చిత్రంలో విశ్వామిత్రుడిగా మోహన్ బాబు పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మిగిలిన పాత్రల కోసం ఆయా భాషల్లో ప్రముఖ నటీనటులను తీసుకునే పనిలో ఉన్నారు చిత్ర బృందం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu