ఒక్క సీన్‌ 45 రోజుల షూట్‌!

టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా ఓ భారీ మల్టీ స్టారర్‌ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించిన దగ్గరనుంచి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా బడ్జెట్‌, జానర్‌, నటీనటులకు సంబంధించిన వార్తలు ఫిలిం సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

తాజాగా మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సినిమాలో కీలకమైన ఇంటర్వెల్‌ సీన్‌ను రాజమౌళి భారీగా డిజైన్‌ చేస్తున్నాడట. ఈ ఒక్క సీన్‌నే దాదాపు 45 రోజుల పాటు తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోం‍ది. ఈ ఎడిసోడ్‌లో కళ్లు చెదిరే ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంటుందన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ముగ్గురు అందాల భామలు అలరించనున్నారట. వారిలో ఒకరు విదేశీ హీరోయిన్‌ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి వార్తలపై చిత్రయూనిట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.