HomeTelugu Newsఅనుష్కకి ముద్దు పెట్టిన అన్నలు.. ఫొటో వైరల్

అనుష్కకి ముద్దు పెట్టిన అన్నలు.. ఫొటో వైరల్

15 1
అనుష్క శెట్టి ఒక్కటి రెండు కాదు 15 ఏళ్ల నుంచి టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది . ఈ మధ్య కాలంలో అనుష్క కాస్త సినిమాల జోరు తగ్గించింది కానీ రెండేళ్ల కింది వరకు అసలు అనుష్క డేట్స్ కావాలంటే ఎంతటి అగ్ర నిర్మాత అయినా కూడా చెమటోడాల్సిందే. అలాంటి ఇమేజ్ ఈ భామ సొంతం. బాహుబలి, భాగమతి లాంటి సినిమాల తర్వాత భారీ బ్రేక్ తీసుకుని ఇప్పుడు నిశ్శబ్ధం అంటూ వచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మరో హిందీ, కన్నడ, మళయాల, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇందులో ఇద్దరు వ్యక్తులు అనుష్కకు ముద్దుపెడుతూ ఉన్నారు. అది కూడా ఒకేసారి చెరో బుగ్గపై తమ ఆత్మీయ ముద్దులు పెడుతున్నారు. వాళ్లెవరబ్బా అని ఆరా తీస్తే అనుష్క శెట్టి అన్నయ్యలు అని తెలిసింది అభిమానులకు. నెల రోజుల కింద తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంది అనుష్క. అయితే అప్పుడు బయటికి రాని కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఇద్దరు అన్నయ్యలు చెల్లిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టారు. ఈ ఫోటోలో ముద్దుల చెల్లెలు కూడా మురిసిపోయింది. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు కుటుంబానికి సరైన సమయం ఇస్తూ అలా కెరీర్‌లో దూసుకెళ్లిపోతుంది అనుష్క. ఈమె నటించిన నిశ్శబ్ధం సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!