ప్రభాస్‌ ‘సాహో’ నిర్మాతతో మెగా హీరో!

మెగా హీరో వరుణ్ తేజ్ మంచి కథల్ని ఎంచుకుంటూ, వరుస విజయాల్ని అందుకుంటూ కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘అంతరిక్షం’, అనిల్ రావిపూడి దర్శకత్వంలో స్టార్‌ హీరో వెంకటేష్ తో కలిసి ‘ఎఫ్2’ అనే సినిమాలు చేస్తూనే ఇంకో సినిమాకు శ్రీకారం చుట్టాడు.

ఈ చిత్రాన్ని ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేయనున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలుకానుంది. ఈ సినిమాను ప్రభాస్.. భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నిర్మిస్తుందని సమాచారం. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.