అనుష్క పెళ్లి ఆ వ్యాపారవేత్తతోనేనా..?

దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. అయితే ‘భాగమతి’ సినిమా తరువాత ఆమె మరో సినిమా కమిట్ అవ్వలేదు. దానికో కారణం ఉందని చెబుతున్నారు. ఈ మధ్య తరచూ అనుష్క పెళ్లి గురించి మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పుడు ఆమె పెళ్లిపై మరో వార్త వినిపిస్తోంది.

బెంగుళూరుకి చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె వివాహం జరగబోతోందని చెప్పుకుంటున్నారు. అనుష్క కుటుంబసభ్యులకు ఆయన మంచి సన్నిహితుడనీ.. దీంతో ఈ పెళ్లి విషయం అనుష్క తన తల్లితండ్రుల నిర్ణయానికే వదిలేసిందనీ చెబుతున్నారు. గతంలో కూడా ఇలానే ఓ బిజినెస్మెన్ ను అనుష్క పెళ్లాడబోతోందని అన్నారు. కానీ ఆ విషయంలో క్లారిటీ లేదు. ఈసారి మాత్రం అనుష్క పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే ఆమె కొత్తగా మరే ప్రాజెక్ట్ కూడా ఒప్పుకోలేదని అంటున్నారు.