షాక్‌ ఇస్తున్న అనుష్క పారితోషికం

టాలీవుడ్‌లో సూపర్‌ సినిమాతో అడుగుపెట్టింది అనుష్క శెట్టి. సూపర్ సినిమాలో హాట్ గర్ల్ గా నటించి మెప్పించింది. దీని తరువాత ఈ అమ్మడు వరసగా సినిమాలు చేసింది. 2009లో వచ్చిన అరుంధతి సినిమాతో పూర్తిగా మారిపోయింది అనుష్క. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అనుష్క పారితోషికం విషయంలో కూడా అదే రేంజ్ లో ఉన్నది.

సౌత్ టాప్ లో పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా అనుష్క పేరు తెచ్చుకుంది. సౌత్ తో లేడీ సూపర్ స్టార్ నయనతార ఏకంగా రూ.6 కోట్లు తీసుకుంటే.. అనుష్క ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్లు తీసుకుంటున్నట్టు వినికిడి. బాహుబలి తరువాత అనుష్క వెయిట్ పెరిగింది. వెయిట్ ను తగ్గించుకునే ప్రయత్నంలో సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉన్నది. ఇప్పుడు అనుష్క నిశ్శబ్దం సినిమా చేస్తున్నది. తన వెయిట్ కు తగిన సినిమాలను ఎంచుకొని అనుష్క సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.