Homeతెలుగు Newsదేశం బావుంటే రాష్ట్రం కూడా బావుంటుంది: చంద్రబాబు

దేశం బావుంటే రాష్ట్రం కూడా బావుంటుంది: చంద్రబాబు

అమరావతి ప్రజావేదికలో రాష్ట్రస్థాయి కలెక్టర్ల సదస్సులోఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేశారు. పరిపాలన, రాజకీయం రెండూ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబు తెలిపారు. అందుకే పొలిటికల్ గవర్నెన్స్ దిశగా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. దేశ రాజకీయాలు రాష్ట్రం మీద ఎంతో ప్రభావం చూపుతాయని, దేశం బావుంటే రాష్ట్రం కూడా బావుంటుందని స్పష్టం చేశారు. ఒక విజన్‌తో నాడు హైదరాబాద్‌ని అభివృద్ధి చేశానన్నారు. మైక్రోసాఫ్ట్, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో తీసుకురావడంలో చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. ‘నగరాన్ని నాలెడ్జ్‌ ఎకానమీగా అభివృద్ధి చేశాం. శంషాబాద్‌ విమానాశ్రయానికి 5వేల ఎకరాలు అవసరమా? అని ఆ రోజు ప్రశ్నించిన వారు ఉన్నారు. అప్పట్లో హైదరాబాద్‌కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు నడపడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు అమరావతికి అవే ఇబ్బందులు పడుతున్నాం. హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు నేను సాధించిందే. అదే స్ఫూర్తితో అమరావతికి కూడా అంతర్జాతీయ విమాన సర్వీసలు సాధిస్తాం. కేసీఆర్‌ హైదరాబాద్‌లో ఫాంహౌస్‌ తప్ప ఏం కట్టారు? సైబరాబాద్‌ మా విజన్‌ వల్లే వచ్చింది’ అని చంద్రబాబు అన్నారు.

1 29

చెప్పినదానికి, చేసినదానికి పొంతనలేకుండా పాలన సాగిస్తే ప్రజల్లో అసహనం తప్పదని చంద్రబాబు అన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా కేంద్రంలో నరేంద్రమోడీ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. మోడీపై ప్రజలు ఆరోజు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఇప్పుడంత నిరాశలో కూరుకుపోయారని బాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.16వేల కోట్లు ఖర్చుపెట్టామని.. జాతీయ ప్రాజెక్టుగా కాంగ్రెస్‌ హయాంలోనే గుర్తించిందని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీదుగా నిర్మించాలని ప్రణాళిక సంఘం సిఫారసు చేసిందన్నారు చంద్రబాబు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!