‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై హైకోర్ట్ మళ్లీ వాయిదా

రామ్‌ గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై ఈరోజు ఏపి హైకోర్ట్ ఏదోఒక తీర్పు ఇస్తుందని దర్శక నిర్మాతలు ఉదయం నుంచి ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, హైకోర్ట్ మాత్రం దానికి విరుద్ధంగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విచారణను ఏప్రిల్ 9 వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీం కోర్ట్ లో దీనికి సంబంధించిన కేసు పెండింగ్ లో ఉన్న కారణంగా ఎలాంటి తీర్పు ఇవ్వలేమని చెప్పింది.

అంతేకాదు, ఈరోజు జడ్జి చాంబర్ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను చూడాల్సి ఉన్నా.. సుప్రీం కోర్ట్ లో పెండింగ్ ఉన్న కారణంగా సినిమా చూడలేమని చెప్పింది. హైకోర్ట్ తీసుకున్న నిర్ణయంపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.