పవన్ కళ్యాణ్ పరిణితిలేని నాయకుడు

గురువారం ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విజయవాడలో మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిణితిలేని నాయకుడు అని విమర్శించారు. పవన్ రాతి నేల మీద నాటిన మొక్క లాంటివాడు, పవన్ మరో జీవీఎల్ అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా జోడీలకు పవన్ ఒక అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నాడన్నారు. కాంగ్రెస్ లో పీఆర్పీని విలీనం చేయటం పవన్ కి తప్పుగా కనిపించటం లేదా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

కోడి కత్తి డ్రామా రక్తి కట్టించి వైసీపీ అధినేత జగన్ రెస్ట్ తీసుకున్నాడు అని వర్ల రామయ్య విమర్శించారు. రెస్ట్ కావాలంటే పాదయాత్ర మనుకోవచ్చు గాని డ్రామాలు అడకూడదన్నారు. జగన్ కన్నా జోగి రమేష్ 100 రెట్లు బెటర్.. వ్యవస్థను గౌరవించి స్టేషన్ కి హాజరయ్యాడు. జగన్.. జోగి రమేష్ ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బీజేపీకి మానసపుత్రుడు గాలి జనార్ధన రెడ్డి, మరో మాల్యా గాలి అని ఎద్దేవా చేసారు వర్ల రామయ్య. మోడీ హయంలో గాలి జనార్ధన్ రెడ్డి దేశాలు దాటినా ఆశ్చర్యపోనక్కరలేదు అని వర్ల రామయ్య అన్నారు.