HomeTelugu Trendingఅర్చన పెళ్లి ముహూర్తం ఖరారు

అర్చన పెళ్లి ముహూర్తం ఖరారు

8 21

బిగ్‌బాస్‌ ఫేమ్‌ అర్చన పెళ్లి ముహూర్తం ఖరారైంది. నవంబరు 13న హైదరాబాద్‌లో ఆమె వివాహ వేడుక జరగనుంది. హెల్త్‌కేర్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ జగదీశ్‌తో అక్టోబరు 3న ఆమెకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ శుభకార్యానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

2004లో ‘తపన’ సినిమాతో అర్చన తెలుగు చిత్ర పరిశ్రమకు నటిగా పరిచయం అయ్యారు. ‘నేను’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘శ్రీరామదాసు’, ‘పౌర్ణమి’, ‘సామాన్యుడు’ తదితర చిత్రాల్లో మెరిశారు. ఆమె చివరిసారి ‘వజ్ర కవచధర గోవిందా’ సినిమాలో వెండితెరపై కనిపించారు. అర్చన తెలుగులోనే కాకుండా పలు మలయాళం, కన్నడ, తమిళ సినిమాల్లోనూ సందడి చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!