HomeTelugu Trendingఅయోధ్య కేసులో వాదనలు ఏమిటంటే..?

అయోధ్య కేసులో వాదనలు ఏమిటంటే..?

3 8
అయోధ్య కేసులో ఓవైపు హిందూ పక్షాలు, మరో వైపు ముస్లిం ప్రతినిధులు వెల్లడించిన అంశాలేమిటి అనేదానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసులో ఆయా పక్షాలు అనేక అంశాలను కోర్టు దృష్టికి తెచ్చాయి. చరిత్ర, విశ్వాసాలు, నమ్మకాలు, తవ్వకాల్లో లభించిన సాక్ష్యాలు, శతాబ్ద కాలంగా కోర్టుల్లో జరుగుతున్న, జరిగిన విచారణలు,
తీర్పులను ఇరు పక్షాలు కోర్టుముందు ఉంచాయి.

హిందూ పక్షాలు సుప్రీంకోర్టు దృష్టి తెచ్చిన అంశాలు ఏమిటంటే.. అయోధ్యలోని వివాదాస్పద భూమి మొత్తం శ్రీరాముడి జన్మస్థానమని.. కోట్లాది మంది హిందువుల విశ్వాసంగా పూరాణాల్లో పేర్కొన్నట్లు తెలిపాయి. రామజన్మభూమి అనేది చట్టపరంగా నిలుస్తుందని, ఇది దేవుడి ప్రతిరూపమైన ఆరాధనా క్షేత్రమని.. మహిమాన్వితుడైన పరాత్పరుడు ఉంటాడని హిందువుల నమ్మకమని హిందూవుల తరపున లాయర్లు కోర్టుముందు వెల్లడించారు. ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారని వెల్లడించారు. ఈ మేరకు 2003లో భారత పురావస్తు శాఖ నివేదిక కూడా ఇచ్చిందని.. అక్కడ మసీదు కట్టినా రామజన్మభూమి తన దైవత్వాన్ని కోల్పోలేదని.. ఆలయాన్ని కూల్చేసినా దాని పవిత్రత అలాగే ఉంటుందని వివరించారు. అయోధ్యలో వివాదాస్పద స్థలంలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించి ఉండొచ్చని… అంతమాత్రాన ఆ స్థలం తమదే అనే హక్కు ముస్లింలకు ఉండబోదని తెలిపారు. బాబ్రీ మసీదు నిర్మాణం లోపల మనుషులు, జంతువుల విగ్రహాలు కనిపించాయని.. విగ్రహారాధన ఇస్లాం విశ్వాసానికి వ్యతిరేకమని సుప్రీంకోర్టుకు తెలిపాయి హిందూ పక్షాలు.

ముస్లిం పక్షాలు కూడా బలమైన వాదనలు వినిపించాయి. వివాదాస్పద స్థలంలో ఏదైనా ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారా అనే అంశంపై పురావస్తు శాఖ నివేదిక అసమగ్రంగా ఉందని తెలిపాయి. తుది విశ్లేషణ చేసిందెవరో? నివేదికను ఎవరు రూపొందించారో తెలియదు.. .దానిపై సంతకం కూడా లేదు… అయోధ్య రాముడి జన్మస్థానం కావొచ్చు… కాదనం… కానీ వివాదాస్పద స్థలంలోనే రాముడు పుట్టాడన్నదానికి ఆధారాల్లేవన్ని ముస్లిం లాయర్ల వాదన. అక్కడ ఉన్నది బాబర్‌ హయాంలో నిర్మించిన బాబ్రీ మసీదు మాత్రమేనని.. ప్రధాన గుమ్మటం కింద హిందువులు పూజలు చేసినట్లు ఆధారాల్లేవని‌.. బయట ఉన్న రామ్‌ చబుత్రాలోనే ఎప్పుడూ పూజలు జరిగాయి అని తెలిపారు. 1949 వరకూ ఆ స్థలం ముస్లింల ఆధీనంలోనే ఉందని.. అప్పటి వరకూ ప్రార్థనలు జరిగాయని వెల్లడించారు. 1949 డిసెంబరు 22-23న అర్ధరాత్రి సమయంలో ప్రధాన గుమ్మటం కింద విగ్రహాలు పెట్టారని, పురాణాలు, ఇతిహాసాలు, దేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల కథనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోరాదని.. వాస్తవంగా ఏం జరిగిందో చెప్పాలని కోరారు. మసీదును కూల్చేశారన్నది ఇటీవలి చరిత్రగా తేల్చారు.. దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu