స్టార్‌ హీరోపై అరెస్ట్ వారెంట్!

కన్నడ స్టార్ హీరో సుదీప్ పెద్దగా పరిచయం అక్కర్లేదు నటుడు. ‘ఈగ, బాహుబలి’ సినిమాలతో ఆయనకు తెలుగునాట కూడా మంచి గుర్తింపు లభించింది. తాజాగా కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివారాల్లోకి వెళితే సుదీప్ తన బ్యానర్లో నిర్మిస్తున్న వీక్లీ కోసం చిక్మగళూరులో దీపక్ మయూర్ అనే వ్యక్తికి చెందిన ఇంటిని, తోటను అద్దెకు తీసుకున్నాడు.

కానీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం వలన అక్కడ ఆస్తి నష్టం జరిగింది. దాంతో మయూర్ 1.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని సుదీప్ నిర్మాణ సంస్థకు తెలిపాడు. కానీ సుదీప్ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. మయూర్ కోర్టు నోటీసులు పంపినా, కోర్టు వారు విచారణకు హాజరుకావాలని చెప్పినా సుదీప్ నిర్లక్ష్యం చేశాడు. ఇక లాభం లేదనుకున్న కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.