సమంతను తీసుకోవడం వెనుక దత్ ఆలోచన!

ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ మళ్ళీ సినిమా నిర్మాణంలో బిజీ కావాలని ప్లాన్ చేస్తున్నారు. తన అల్లుడు నాగశ్విన్ రూపొందిస్తోన్న సావిత్రి బయోపిక్ ను భారీగా నిర్మించాలని భావిస్తున్నారు. 

కాంబినేషన్స్ ను సెట్ చేయడంలో అశ్వనీదత్ కు స్పెషాలిటీ వేరు. ఎన్నో హిట్ కాంబినేషన్స్ సెట్ చేసి నిర్మాతగా ఆయనేంటో  నిరూపించుకున్నాడు. ఇప్పుడు కూడా ఆయన సావిత్రి సినిమా కోసం అదే ఫాలో అవ్వబోతున్నారు.

ముందుగా సావిత్రి పాత్ర కోసం నిత్యమీనన్ ను ఎన్నుకున్నారు. కానీ సడెన్ గా ఆమెను తప్పించి ఆ పాత్రలోకి సమంతను తీసుకున్నారు. దానికో కారనముంది. సావిత్రి బయోపిక్ అంటే అందులో ఖచ్చితంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ ల పాత్రలు ఉంటాయి. వాటి కోసం నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్ లను తీసుకోవాలనేది దత్ ఆలోచన. కానీ వారిద్దరు నటించడానికి సిద్ధంగా లేరు.

సమంతను తీసుకోవడం ద్వారా చైతును పాత్ర కోసం ఒప్పించే అవకాశాలు ఉన్నాయి. అలానే ఎన్టీఆర్, సమంతల కాంబినేషన్ అంటే హిట్ కంపల్సరీ. సో.. ఎన్టీఆర్ ఒప్పుకునే ఛాన్స్ ఉంది. లేదంటే చైతు, ఏఎన్నార్ పాత్ర కోసం రెడీ అయినప్పుడు తారక్ కూడా ఎన్టీఆర్ పాత్ర కోసం సిద్ధపడే ధైర్యం చేయాల్సిందే.. ఆవిధంగా ఈ ప్రాజెక్ట్ లోకి సమంతను చేర్చారు. అదన్నమాట మేటర్.