ఈసారైనా.. కాంబినేషన్ సెట్ అవుతుందా..?

గతంలో చాలా సార్లు సమంత, రామ్ చరణ్ కలిసి నటించాలనుకున్నారు. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. సమంతకు రామ్ చరణ్ తో నటించలేదనే లోటు ఉండే ఉంటుంది. తాజాగా ఈ కాంబినేషన్ సెట్ కాబోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గ్రామీణ నేపధ్యంలో సాగే ఈ సినిమా కోసం హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఎన్నుకున్నారు.
కానీ అనుపమ పారితోషికం డిమాండ్ చేసిందని ఆమెను పక్కన పెట్టేసినట్లు టాక్. దీంతో ఇప్పుడు ఈ ఛాన్స్ సమంతకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత తెలుగు సినిమాలు పెద్దగా ఒప్పుకోవట్లేదు. తమిళంలో మాత్రం ఓ మూడు ప్రాజెక్ట్స్ చేయబోతోంది. అమ్మడుకి కథ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సినిమా చేస్తుంది. మరి ఈ సారైనా.. ఈ జంటను తెరపై చూసే భాగ్యం ప్రేక్షకులకు కలుగుతుందేమో చూడాలి!