HomeTelugu Big Storiesరివ్యూ: లంక

రివ్యూ: లంక

నటీనటులు: రాశి, సాయి రోనాక్, ఐనా సాహ, సుప్రీత్, సుదర్శన్ తదితరులు
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: రవికుమార్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాత: నామన దినేష్-నామన విష్ణు కుమార్
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీముని
సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘లంక’. శ్రీముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నామన శంకర్రావు-సుందరిలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
లేని పిల్లలను ఊహించుకుంటూ బ్రతుకుతున్న రెబాకా విలియమ్స్(రాశి)కు ఏదో తనను వెంటాడుతోందని భావించే హీరోయిన్ స్వాతి(ఐనా సాహ)కు మధ్య రిలేషన్ ఏర్పడుతుంది. స్వాతి సమస్యను టెలీపతి ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది రెబాకా. ఆ ప్రాసెస్ లో స్వాతి కనిపించకుండా పోతుంది. అసలు స్వాతి ఏమైంది..? ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా..? స్వాతిని రక్షించగలిగారా..? స్వాతి కనిపడకపోవడం వెనుక రెబాకా హస్తం ఏమైనా.. ఉందా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్:
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
రాశి
మైనస్ పాయింట్స్:
సాగతీత
లాజిక్స్ లేని సన్నివేశాలు
ఫస్ట్ హాఫ్
కామెడీ

విశ్లేషణ:
టెలీపతి ఆధారంగా తెలుగులో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఆ పాయింట్ కు థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను జోడించి తీసిన సినిమా లంక. కథ, కథనాల్లో బలం లేనప్పటికీ దర్శకుడి టేకింగ్ బావుంది. సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే వరకు మెయిన్ స్టోరీలోకి ఎంటర్ కాకపోవడం విసుగు పుట్టిస్తుంది. సెకండ్ హాఫ్ లో కూడా ఆసక్తి కరంగా ఉండదు. కథనం గ్రిప్పింగ్ గా లేకపోవడంతో ఆడియన్స్ కు కథ పెద్దగా కనెక్ట్ కాదు. సెకండ్ హాఫ్ లో లాజిక్స్ అందని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని కథలు నేరేట్ చేసినప్పుడు బాగానే అనిపిస్తాయి కానీ ఎగ్జిక్యూషన్ లో సమస్యలు వస్తాయి. లంక పరిస్థితి కూడా అంతే. అసలు డైరెక్టర్ అనుకున్న పాయింట్ ను ప్రీక్లైమాక్స్ వరకు రివీల్ చేయలేదు. ఎన్నో మలుపులు తిరిగిన కథ చివరకు హ్యూమన్ ట్రాఫికింగ్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఆ పని చేసే ఓ సైకోను రాశి ఎలా అంతమొందించిందనేది మెయిన్ స్ట్రీమ్. మొత్తానికి అటు ఇటు చేసి సినిమాను ఏదో నడిపించేశారు. కానీ అది ఆడియన్స్ కు మాత్రం నచ్చే రీతిలో లేదు.

నటన పరంగా రాశి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఐనా సాహ కూడా తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సాయి రోనాక్ నటనలో ఇంకా చాలా మెట్లు ఎక్కాలి. సత్య, సుదర్శన్ ల కామెడీ విసిగించింది. సినిమాటోగ్రఫీ వర్క్ బావుంది. కొన్ని షాట్స్ బాగా తీశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గట్లుగా ఉంది. గ్రాఫిక్స్ సీన్స్ ఏ మాత్రం బాలేవు. ఎడిటింగ్ వర్క్ మీద
ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బావున్నాయి.

రేటింగ్: 1.5/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu