తెలుగు హీరోలపై తమిళ దర్శకుడి కన్ను!

తమిళ యువ దర్శకుడు అట్లీకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మాస్ ఆడియన్స్ లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన ‘మెర్సల్’ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతుంది. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన ‘రాజా రాణి’,’పోలీసోడు’ వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘మెర్సల్’ సినిమా కూడా ‘అదిరింది’ అనే పేరుతో తెలుగులో విడుదల కానుంది.

ఈ క్రమంలో అట్లీ ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. తెలుగులో చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు ఈ డైరెక్టర్. ఇప్పటికే మహేష్, బన్నీలతో చర్చలు జరిపానని అన్నారు. మరి ఈ ఇద్దరిలో అట్లీకు అవకాశం ఇచ్చే ఆ స్టార్ హీరో ఎవరనేది తెలియాల్సివుంది.

ఇప్పటికే తమిళంలో ఎక్కడాలేని క్రేజ్ తెచ్చుకున్నాడు. స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ అట్లీ మాత్రం తెలుగు వారిపై దృష్టి పెట్టడం విశేషమనే చెప్పాలి.