అత్త కోసం నయన్ పాట్లు!

గత కొంతకాలంగా నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను ప్రేమిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘నానుమ్ రౌడీతాన్’ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలను ప్రచురిస్తున్నారు. తాజాగా ఓ సంఘటన ఈ వార్తల్లో నిజముందని నిరూపిస్తుంది. విఘ్నేశ్ శివన్ తల్లితండ్రులు ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ గా పని చేసేవారు. ముఖ్యంగా విఘ్నేశ్ తల్లి పేరు చెప్తే రౌడీలు భయపడేవారట. ఈ విషయాలు తెలుసుకున్న నయనతార ఆమెను ఇప్పటినుండే మచ్చిక చేసుకోవాలని విఘ్నేశ్ ఆమెను పరిచయం చేయడంతో.. ఆ పరిచయాన్ని మరింత పెంచుకోవడానికి నయన్ ఆమెను ఇంటికి పిలిచి విందునిచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆ విందు స్వయంగా నయన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాబోయే అత్తగారి కోసం నయన్ వంటింటికి వెళ్ళి మరీ ఆమెకు వంట చేసి పెట్టడంతో కోలీవుడ్ మీడియా త్వరలోనే నయన్, విఘ్నేశ్ శివన్ ను వివాహమాడనుందని వార్తలను ప్రచురిస్తున్నాయి.