HomeTelugu Big Storiesమహేష్‌ బాబు రెండు బ్యాంకు అకౌంట్లు జప్తు

మహేష్‌ బాబు రెండు బ్యాంకు అకౌంట్లు జప్తు

10 21సూపర్‌ మహేష్‌ బాబుకు చెందిన రెండు బ్యాంకు అకౌంట్లను జీఎస్‌టీ కమిషనరేట్‌ కార్యాలయం జప్తు చేసింది. గడచిన పదేళ్ళ నుంచి సర్వీస్‌ ట్యాక్‌ బకాయిలు కట్టనందున బ్యాంకుల నుంచి సొమ్మును రికవర్‌ చేసినట్లు హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 2007-08లో వివిధ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పాల్గొన్నందుకు, ఆయా కంపెనీల ఉత్పత్తుల ప్రకటనల్లో నటించి తన సేవలు అందించారని, దీనికిగాను వసూలు చేసిన రెమ్యూనరేషన్‌పై మహేష్‌ బాబు సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టలేదని పేర్కొంది. 2007-08 నాటి బకాయి రూ. 18.5 లక్షలు కాగా, ఆ తరవాత కూడా సదరు సేవలకు ఆయన సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టేలేదని పేర్కొంది. ప్రస్తుతం మహేష్‌ బాబు సర్వీస్‌ ట్యాక్స్‌ బకాయి రూ. 39 లక్షలు దాకా చేరిందని కమిషనరేట్‌ తెలిపింది. బకాయిలతో పాటు వాటిపై వడ్డీ, పెనాల్టి కలిపి రూ. 73.5 లక్షలకు చేరినట్లు వివరించింది. బకాయిలు వసూలులో భాగంగా మహేష్‌ బాబుకు చెందిన యాక్సిస్‌ బ్యాంక్‌ ఖాతాలో ఉన్న రూ. 42.96 లక్షలను తాము రికవర్‌ చేసినట్లు తెలిపింది. అలాగే ఆయనకు ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉన్న ఖాతాను కూడా జప్తు చేశామని, అయితే ఖాతా నుంచి ఇంకా డబ్బు బదిలీ కాలేదని పేర్కొంది. రేపటి లోగా బ్యాంక్‌ సదరు మొత్తాన్ని తమ శాఖకు బదిలీ చేయాలని, లేనిపక్షంలో ఆ బ్యాంక్‌పై కూడా చర్య తీసుకుంటామని కమిషనరేట్‌ హెచ్చరించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu