అవసరాల ‘బాబు.. బాగా బిజీ’!

అవసరాల శ్రీనివాస్ హీరోగా నవీన్ మేడారంను దర్శకునిగా పరిచయం శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘బాబు.. బాగా బిజీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. బాలీవుడ్ హిట్ ‘హంటర్’కి తెలుగు రీమేక్ ఇది. హిందీ చిత్రాన్ని నిర్మించిన ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థ తెలుగు చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. మిస్త్రీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంధర్భంగా.. అభిషేక్ నామా మాట్లాడుతూ.. ”రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనర్ చిత్రమిది. ఈ చిత్రాన్ని చూసినప్పుడు ఎంతో నవ్వుకున్నారు.

తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు హీరోగా అవసరాల శ్రీనివాస్ అయితే పాత్రకు న్యాయం చేయగలరనిపించింది. ఇటీవల సినిమాలో కొన్ని సీన్లు చూసిణా నిర్ణయం సరైనదని మరోసారి అనుకున్నా. అవసరాల శ్రీనివాస్ గారు అధ్బుతంగా నటించారు. ప్రారంభం నుండి ముగింపు వరకు నవ్విస్తుందీ చిత్రం. త్వరలోనే ఆడియో విడుదల తేదీ ప్రకటిస్తాం” అన్నారు.