HomeTelugu Big Storiesఇంద్రగంటి మల్టీస్టారర్ కు టైటిల్ ఫిక్స్!

ఇంద్రగంటి మల్టీస్టారర్ కు టైటిల్ ఫిక్స్!

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రానికి “అమీ తుమీ” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను నేడు ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన వేడుకలో చిత్ర బృందం సమక్షంలో విడుదల చేసారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. “ఈనెల 23వ తేదీతో టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న “అమీ తుమీ” తెలుగు ప్రేక్షకులను మనస్ఫూర్తిగా నవ్వుకొనేలా చేస్తుంది. అవసరాల-అడివి శేష్ ల మధ్య సన్నివేశాలు టైటిల్ కు తగ్గట్లుగా ఉంటాయి. ఈషా, అదితి మ్యాకల్ పాత్రలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. పాటల చిత్రీకరణను త్వరలోనే పూర్తి చేసి ఆడియో మరియు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం. అందరూ తెలుగు ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu