HomeTelugu Trendingపిండం నుండి శ్రీనివాస్‌ అవసరాల ఫస్ట్‌లుక్‌

పిండం నుండి శ్రీనివాస్‌ అవసరాల ఫస్ట్‌లుక్‌

Avasarala srinivas first l
చాలా రోజుల గ్యాప్ త‌రువాత ఒక‌రికి ఒక‌రు ఫేమ్ శ్రీరామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పిండం’. కుశీ రవి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్‌కు ఇదే మొదటి మూవీ. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.

టాలీవుడ్ యాక్ట‌ర్ క‌మ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీ నుంచి అవసరాల శ్రీనివాస్ ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర‌బృందం తాజాగా విడుద‌ల చేసింది. ఇక ఈ సినిమాలో అవసరాల ‘లోక్‌నాథ్’ పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తుంది. సోఫాలో కూర్చొని తీక్షణంగా ఎవరినో చూస్తున్నట్లు ఈ పోస్టర్ ఉంది.

ఈ సినిమాను డిసెంబ‌ర్ 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. కళాహి మీడియా పతాకంపై యశ్వంత్‌ దగ్గుమాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, రవివర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ ఈషా, విజయలక్ష్మి, శ్రీలత త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu