చిన్నారి పెళ్లికూతురికి వేధింపులు!

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో తెలుగునాట క్రేజ్ సంపాదించుకున్న నటి అవికాగోర్.. ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. సినిమా చూపిస్త మావ, లక్ష్మి రావే మా ఇంటికి వంటి చిత్రాల్లో మెరిసిన ఈ భామ.. దర్శకత్వ శాఖలో నైపుణ్యం పొందేందుకు ఫారెన్ వెళ్ళి కోర్స్ లో జాయిన్ అయింది.

దీంతో సినిమాలకు గ్యాప్ వచ్చింది. రీసెంట్ గా ఎక్కడకిపోతావు చిన్నవాడా సినిమాలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే టాలీవుడ్కు చెందిన ఓ యంగ్ హీరో అవికాను వేధిస్తున్నాడట. అసభ్యసందేశాలను అవికా ను పంపిస్తున్నట్లు సమాచారమ్.

మొదట ఈ విషయాన్ని లైట్ తీసుకున్న ఈ భామ అతడు పెట్టే టార్చర్ ఎక్కువవుతుండడంతో అలా మెసేజ్ లు చేస్తోంది ఎవరో తెలుసుకొని షాక్ కు గురైందట. తనకు బాగా తెలిసిన ఓ యువ హీరో అలా మెసేజ్ లు చేస్తున్నాడని తన సన్నిహితుల వద్ద చెప్పుకొని వాపోయిందట. అతగాడి దెబ్బకు టాలీవుడ్ సినిమాల్లో నటించాలంటే విరక్తిగా ఉందని
తన ఆవేదనను వ్యక్తం చేస్తోంది. ఇంతకీ ఆ యువహీరో ఎవరో..?