రజనీకాంత్ 166వ సినిమా ఫస్ట్‌లుక్


చాలా రోజుల త‌ర్వాత “పేట”సినిమాతో అభిమానులను సంతోషం పంచాడు ర‌జినీకాంత్. ఈ చిత్రం కోరుకున్న విజ‌యం సాధించలేకపోయినా పర్వాలేదని పించింది. కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రంతో చాలా ఏళ్ల త‌ర్వాత త‌మిళ‌నాట రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక ఈ జోరులోనే మ‌రో సినిమాకు కూడా ముహూర్తం పెట్టేసాడు. ర‌జినీకాంత్ 166వ సినిమా అంటూ ఇప్పుడు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసాడు మురుగ‌దాస్. బాషా సినిమా గుర్తు చేస్తూ మ‌రోసారి గ‌న్ పట్టుకుని ర‌చ్చ చేస్తున్నాడు సూప‌ర్ స్టార్.

ఈ నెలలోనే ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. “స్పైడ‌ర్” లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత “స‌ర్కార్” సినిమాతో హిట్ కొట్టి ఫామ్‌లోకి వ‌చ్చాడు మురుగ‌దాస్. విజ‌య్ హీరోగా న‌టించిన ఈ చిత్రం రూ. 250 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇదే జోరులో ఇప్పుడు ర‌జినీకాంత్ సినిమా మొద‌లు పెడుతున్నాడు మురుగ‌దాస్. ఈ చిత్రాన్ని కేవ‌లం ఎనిమిది నెల‌ల్లోనే పూర్తి చేసి.. ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ద‌ర్శ‌కుడిగా మారిన టైమ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ర‌జినీకాంత్‌తో సినిమా చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు.. ఇన్నాళ్ల‌కు మురుగదాస్‌కు ఆ అవ‌కాశం వ‌చ్చింది.

రజనీకాంత్‌-మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా ‘నార్కాలి’ పేరుతో రాజకీయ నేపథ్యంలో ఉండబోతుందన్న వార్తలను దర్శకుడు మురుగదాస్ ఖండించాడు. ఈ సినిమా కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.

ఇప్పుడు విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే సినిమా మ‌రోసారి మాఫియా నేప‌థ్యంలో తెర‌కెక్కుతుందా అనే అనుమానాలు వ‌స్తున్నాయి. కానీ ఈ సినిమా కథ సందేశాత్మకంగా ఉండబోతుందని.. మరోసారి చిరంజీవి ఠాగూర్ త‌ర‌హాలోనే లంచం నేపథ్యంలోనే ఉండబోతుందనే ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేష‌న్లో క‌చ్చితంగా బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోతుందంటున్నారు అభిమానులు.