HomeTelugu Trendingరీ రిలీజ్ ల్లో కొత్త ట్రెండ్ సృష్టించనున్న Baahubali!

రీ రిలీజ్ ల్లో కొత్త ట్రెండ్ సృష్టించనున్న Baahubali!

Baahubali to set new trend in re-releases!
Baahubali to set new trend in re-releases!

Baahubali Re-release:

బాహుబలి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2015లో వచ్చిన బాహుబలి: ది బిగినింగ్, 2017లో వచ్చిన బాహుబలి: ది కన్క్లూజన్.. రెండు భాగాలూ కలిపి ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. ప్రభాస్, అనుష్క, రానా నటించిన ఈ ఎపిక్ యాక్షన్ ఫాంటసీ డ్రామా రెండు భాగాలు కలిపి దాదాపు రూ.2,460 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ఇప్పుడు సినిమా ప్రియులకు ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్. ఇటీవలి కాలంలో పాత హిట్ సినిమాలు మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే కదా. ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ, బాహుబలి 1 & 2 సినిమాల్ని అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇంతకీ ఇదే కాదు స్పెషల్. రెండో పార్ట్‌లో కనిపించిన ఫ్లాష్‌బ్యాక్స్, మొదటి పార్ట్‌లో చూపించిన కీలక ఘట్టాల్ని ఎడిట్ చేసి, రెండు భాగాల మేజర్ సీన్లను కలిపి ఓ గ్రాండ్ సింగిల్ వర్షన్ రూపొందించాలనుకుంటున్నారు. అలా చేస్తే స్టోరీ ఫ్లో మరింత క్లియర్‌గా, ఫ్లోలో నెమ్మదిగా వెళ్లేలా ఉంటుందట.

దర్శకుడు రాజమౌళి విజన్, ఎమ్ఎం కీరవాణి మ్యూజిక్, శోభు యార్లగడ్డ-ప్రసాద్ దేవినేని నిర్మాణ విలువలతో వచ్చిన ఈ సినిమా, భారతీయ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ అయింది.

ఇప్పుడు మళ్లీ థియేటర్లలో ఈ మేజిక్ చూడడానికి ఛాన్స్ వస్తుందంటే ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. ఈసారి కూడా బాహుబలి మ్యాజిక్ మళ్లీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంలో ఎలాంటి డౌట్ లేదు. మిగతా పెద్ద ఫ్రాంచైజీలు కూడా ఇదే పంథాలో రీ-ఎడిట్ వెర్షన్లు తీసుకురావచ్చని టాక్ ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!