బాహుబలి సెట్ ఫోటోస్ ను ఎవరు లీక్ చేశారో..?

బాహుబలి సినిమాతో 500 కోట్ల క్లబ్ ను క్రాస్ చేసిన రాజమౌళి ఇప్పుడు బాహుబలి2 సినిమా
పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి గుర్తింపు రావడంతో రెండో
భాగానికి మరింత హైప్ తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే
ఏడాది రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించిన ఏ ఒక్కటి
బయటకి లీక్ కాకూడదని రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా సరే
ఈరోజు బాహుబలి సినిమాకు సంబంధించిన కొన్ని సెట్ ఫోటోస్ ఇంటర్నెట్ లో దర్శనమిచ్చాయి.
చుట్టూ ఎత్తైన కొండలు.. మధ్యలో బాహుబలి టీం ఈ ఫోటోను బట్టి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో
ఊహించుకోవచ్చు. అయితే ఈ ఫోటోలను ఎవరు లీక్ చేశారనే విషయం మాత్రం తెలియట్లేదు.
రాజమౌళి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ సినిమా మీద ఉన్న ఆసక్తితో ఎవరో
ఆకతాయిలు ఇలా ఫోటోలను లీక్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates