కృష్ణవంశీ మల్టీస్టారర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు అందించిన కృష్ణ వంశీ గత కొంత కాలంగా పెద్దగా విజయాలు అందుకోలేక పోతున్నారు. దీంతో గ్యాప్ తీసుకొని ఈ సంవత్సరం ‘నక్షత్రం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఇక ఆయన నుంచి మరో సినిమా రావడానికి చాలా సమయం పట్టొచ్చని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ మల్టీస్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

ఒక హీరోగా మాధవన్ ను ఎంపిక చేసుకున్నట్టుగా చెబుతున్నారు. బాహుబలి సిరీస్ తో జాతీయ స్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రానా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వర్కవుట్ అవుతోంది చూడాలి!